ప్రైవేటు ఆసుపత్రికి అచ్చెన్నాయుడిని తరలించండి

న్యాయవాది వాదనను తోసిపుచ్చిన కోర్టు

ap high court
ap high court

అమరావతి: టిడిపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో తీర్పు వెల్లడించింది. తనను ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని ఆయన చేసుకున్న విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించింది. అచ్చెన్నాయుడిని గుంటూరులోని రమేశ్‌ ఆసుపత్రికి తరలించేందుకు హైకోర్టు అనుమతి ఇస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. విజయవాడ లేదా గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఏదైనా ఒక ఆసుపత్రికి తరలించాలన్న అంశంపై వాదనలు కొనసాగగా, చివరకు కోర్టు తీసుకున్న నిర్ణయంపై ఏపి ప్రభుత్వ తరఫు న్యాయవాది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అరెస్టయిన అచ్చెన్నాయుడును ఏ ఆసుపత్రికి తరలించాలన్న విషయం ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వాదించారు. అయితే, ఆ న్యాయవాది వాదనను ధర్మాసానం తోసిపుచ్చింది. హైకోర్టు తీర్పుతో పోలీసులు అచ్చెన్నాయుడును కాసేపట్లో ప్రైవేటు ఆసుపత్రికి తరలించనున్నారు. కాగా ఈఎస్‌ఐ మందుల కొనుగోలులో అవకతవకల కేసులో గత నెల 12న అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) అధికారులు అచ్చెన్నాయుడిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.


తాజా కరోనా లాక్‌డౌన్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/corona-lock-down-updates/