ప్రమాణ స్వీకార కార్యక్రమంపై ఏర్పాట్లు

AP Assembly
AP Assembly

అమరావతి: సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం ఆధ్వర్యంలో ఏపి మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఈ సమావేశానికి డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, ఇంటెలిజెన్స్‌ డీజీ, సీఆర్డీఏ కమిషనర్‌ నరసింహ ఇతర శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. సచివాలయం సమీపంలోనా పార్కింగ్‌ ఏరియాలో మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
కాగా మరోవైపు చివాలయం మొదటి బ్లాక్‌లోని సీఎం కార్యాలయ పనులను వైఎస్‌ఆర్‌సిపి నేతలు విజయసాయిరెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి పరిశీలించారు. 8వ తేదీన ఉదయం 8.30గంటలకు సిఎం జగన్‌ తన ఛాంబర్‌లో అడుగుపెట్టనున్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/