గుంటూరులో పర్యటన : ఆరోగ్యశ్రీ విశ్రాంత భృతి పథకం

Guntur: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం గుంటూరులో పర్యటించనున్నారు. వైఎ్‌సఆర్ ఆరోగ్యశ్రీ పథకంలో కొత్తగా ప్రవేశపెడుతున్న రోగుల విశ్రాంతి భృతి పథకాన్ని సీఎం ప్రారంభిస్తున్నారు. మొదట ప్రభు త్వ సమగ్రాస్పత్రిని సందర్శించిన ఆరోగ్యశ్రీ పథకంలో శస్త్రచికిత్సలు చేయించుకున్న రోగులను సీఎం పరామర్శిస్తారు. వైద్య కళాశాల జింకానా ఆడిటోరియంలో మధ్యాహ్నం 12 గంటలకు సీఎం జగన్మోహన్రెడ్డి ఈ కొత్త పథకానికి సంబంధించిన, కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలకు సంబంధించిన బ్రోచర్లు ఆవిష్కరిస్తారు. కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో, మంత్రులు రోగుల విశ్రాంతి భృతి పథకం గురించి పది నిమిషాల పాటు మాట్లాడతారు. సభ ముగిసిన తర్వాత హెలికాప్టర్లో తాడేపల్లికి బయలుదేరుతారు. సీఎం పర్యటన సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు గుంటూరులో సోమవారం ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు.