అచ్చెన్నాయుడిని దెబ్బతీయాలని చూస్తున్నారు

ఇళ్ల స్థలాల ఎంపిక రాజకీయ కక్ష సాధింపుగా మారింది

kalva srinivasulu
kalva srinivasulu

అనంతపురం: బీసీ నేత అయినా అచ్చెన్నాయుడిని రాజకీయంగా దెబ్బతీయాలని వైఎస్‌ఆర్‌సిపి నేతలు చూస్తున్నారని టిడిపి నేత కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. వైఎస్‌ఆర్‌సిపి నేతలు మితిమీరిన జోక్యం చేసుకుంటూ..టిడిపి నేతలను దెబ్బ తీస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీస్తున్నారన్న కోపంతోనే అచ్చెన్నాయుడిపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం రూ.7 కోట్ల ఫైల్‌పై సంతకం చేస్తే ..భారీ స్కాం చేసినట్లు చెబుతున్నారని పేర్కొన్నారు. ఇళ్ల పట్టాల కోసం ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల స్థలాల ఎంపిక రాజకీయ కక్ష సాధింపుగా మారిందన్నారు. చాలా ఏళ్ల నుంచి హక్కుదారులుగా ఉన్న టిడిపి నేతలు, సానుభూతిపరుల భూములు తీసుకుంటున్నారని మండిపడ్డారు. టిడిపి నేతలే టార్గెట్‌గా సాగుతున్న ఈ భూసేకరణను ఆపాలని కాల్వ శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/