ఆర్టీసి కార్మికుల సమస్యలపై సియం సానుకూలం

Y S jagan mohan reddy
Y S jagan mohan reddy, ap cm

అమరావతి: ఆర్టీసి కార్మిక సంఘాల నాయకులు శాసనసభలోని సియం ఛాంబర్‌లో సియం జగన్‌మోహన్‌ రెడ్డిని కలిశారు. ప్రభుత్వంలో ఆర్టీసి విలీనం అంశంపై కమిటీ వేసినందుకు ఈ సందర్భంగా జగన్‌కు ధర్యవాదాలు తెలిపారు. డిమాండ్లపై సియం సానుకూలంగా స్పందించడంతో సమ్మె విరమించుకున్నట్లు కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు.
సియంతో భేటి అనంతరం జెఏసి నేతలు మీడియాతో మాట్లాడుతూ..కార్మికులకు సమస్యలు లేకుండా చూస్తామని, ప్రభుత్వ ఉద్యోగులకు వస్తున్న అన్ని సౌకర్యాలు కల్పిస్తామని సియం హామీ ఇచ్చారని తెలిపారు. తమ డిమాండ్లపై సియం సానుకూలంగా స్పందించడంతో సమ్మె యోచన విరమించుకున్నామని వెల్లడించారు.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/