సమ్మె విషయంలో వెనక్కి తగ్గేది లేదు!

APSRTC-Strike
APSRTC-Strike

అమరావతి: ఏపి ఆర్టీసీ కార్మిక సంఘాలు యాజమాన్యంతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. అయితే తాము ప్రతిపాదించిన 26 డిమాండ్లు పరిష్కరించాలని ఆ సంఘాలు డిమాండ్‌ చేశాయి. యాజమాన్యంతో సమావేశం అనంతరం కార్మిక సంఘాల ఐకాస నేత దామోదర్‌ మీడియాతో మాట్లాడుతు ఆర్టీసీ ఎండీ అందుబాటులో లేరని అధికారులు చెబుతున్నారని, యాజమాన్యం కుట్రలను అడ్డుకుంటామని చెప్పారు. గడువు కావాలని యాజమాన్యం కోరిందని.. అయితే ఇప్పటికే సమ్మె తేదీని ప్రకటించినందున ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. సిబ్బందిని తగ్గించే చర్యలు మానుకోవాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరామని.. అదనపు సమయం పనిచేయబోమని కచ్చితంగా చెప్పామని తెలిపారు. తమ 26 డిమాండ్లలో కేవలం రెండు మాత్రమే ప్రభుత్వం పరిధిలోనివని, మిగతావన్నీ యాజమాన్యం పరిష్కరించాల్సి ఉన్నా.. చిత్తశుద్ధితో వ్యవహరించడంలేదని ఆరోపించారు. తాము చేపట్టనున్న సమ్మె.. యాజమాన్య వైఖరికి నిరసగానే తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదని దామోదర్‌ స్పష్టంచేశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/