హైకోర్టులో ఆఫీస్ సబ్‌ఆర్డినేట్ల నియామకం

AP High Court
AP High Court

అమరావతి: ఉమ్మడి హైకోర్టు విభజన తరువాత ఉద్యోగుల కొరతను తగ్గించేందుకు ఔట్ సోర్సింగ్ పద్ధతిన నియామకాలు చేపట్టింది. రాష్ట్ర హైకోర్టులో 30 మంది ఆఫీస్ సబ్ ఆర్డినెట్‌లను ఔట్సోర్సింగ్ పద్ధతిన నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది అయితే విభజన సందర్భంగా ఏపి హైకోర్టుకు వివిధ కేటగిరిల్లో 990 ఉద్యోగాలు కేటాయింపు జరిగింది. వీటిలో 295 ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు, 37 డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. కాగా, ప్రస్తుతం 57 ఆఫీస్ సబ్ ఆర్డినేట్, 05 డ్రైవర్‌ పోస్టుల నియామకానికి అనుమతిచ్చారు. తాజా ఉత్తర్వులతో హైకోర్టులో కొంతమేర కిందిస్థాయి సిబ్బంది కొరత తీరే అవకాశం ఉంది.


తాజా నాడీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/health