లాంచీకి అనుమతి లేదు : అవంతి

 AP Tourism Minister Avanti Srinivas
AP Tourism Minister Avanti Srinivas

Devipatnam: గోదావరిలో ప్రమాదానికి గురైన లాంచీకి  పర్యాటక శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేవని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రాయల్‌ వశిష్ట బోటును ప్రయివేట్‌ వ్యక్తి నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కోడిగుడ్ల వెంకట రమణ అనే వ్యక్తి ఈ బోటును తిప‍్పుతున్నట్లు చెప్పారు. బాధితులను రక్షించేందుకు పర్యాటక శాఖ హుటాహుటీన రంగంలోకి దిగింది. సహాయక చర్యలకు హెలికాఫ్టర్‌ రంగంలోకి దిగింది.  టూరిజం శాఖ  నుంచి రెండు బోట్లను ప్రమాద  స్థలానికి పంపించారు. సహాయక చర్యల కోసం మంత్రి అవంతి విశాఖ నేవీ అధికారులతో మాట్లాడారు. నేవీ హెలికాఫ్టర్‌తో పాటు అధునాతన బోట్లను ఘటనా స్థలానికి పంపించాలని కోరారు. లాంచీ మునకకు వరద ఉధృతే కారణమని తెలుస్తోంది. గతంలో కూడా ఇదే ప్రాంతంలో రెండు ప్రమాదాలు జరిగినట్లు సమాచారం.