ప్రొటెం స్పీకర్‌గా అప్పలనాయుడు ప్రమాణం

appala-naidu
appala-naidu

అమరావతి: ఏపీ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి చిన వెంకట అప్పలనాయుడు ప్రమాణం చేశారు. అప్పలనాయుడుతో తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణం చేయించారు. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి, సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.