ఏపి కరోనా అప్‌డేట్స్‌

విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

corona virus
corona virus

అమరావతి: కరోనా విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ వైరస్‌ విస్తరిస్తూనే ఉంది. అయితే తాజాగా ఏపి ప్రభుత్వం కరోనా కు సంబందించిన తాజా అప్‌డేట్స్‌ను విడుదల చేసింది.ఈ వివరాల ప్రకారం ఇప్పటివరకు ఏపీకి విదేశాల నుంచి వచ్చిన వారి సంఖ్య 26,942.
కాగా వీరిలో 25,942 మందిని హోం ఐసోలేషన్‌ లో ఉంచారు. ఇప్పటి వరకు 10 మందికి కరోనా పాజిటివ్‌ రాగా 289 మందికి నెగెటివ్‌ వచ్చింది, ఇంకా 33 మంది రిపోర్ట్స్‌ రావాలసి ఉంది. కరోనా అనుమానిత లక్షణాలతో 117 మందికి చికిత్స అందిస్తున్నారు. కాగా రాష్ట్రంలో కరోనా సందేహల నివృత్తి కోసం 104 టోల్‌ ఫ్రీ నంబర్‌ ను ఏర్పాటు చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/