రాజ్యసభలో ‘కరోనా’పై ఏపి ఎంపీల గళం

In parliament session discussion on coronavirus
In parliament session discussion on coronavirus

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌పై ఈ రోజు రాజ్యసభలో చర్చ జరిగింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 29 కరోనా వైరస్‌(కోవిడ్‌-19) పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్రమంత్రి హర్షవర్ధన్‌ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఏపికి చెందిన పలువురు ఎంపీలు స్పందించారు. టిడిపికి చెందిన ఎంపి గల్లా జయదేవ్‌ మాట్లాడుతూ.. కరోనా వల్ల దేశ ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి మార్పులు ఉంటాయన్న విషయాన్ని మనం అర్థం చేసుకుని, ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవ్యస్థపై కూడా కరోనా ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు ప్రజలు భావిస్తున్నారని కూడా ఆయన తెలిపారు. మరోవైపు వైఎస్‌ఆర్‌సిపి ఎంపి విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తిని నిరోధించడానికి అవసరమైన వాక్సిన్‌ కోసం దేశం ఎలాంటి పరిశోధనలు జరుగుతున్నాయో వివరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/