ఏపిలో కొత్త మంత్రుల బాధ్యతల స్వీకరణ

AP ministers 2019
AP ministers 2019


అమరావతి: ముగ్గురు ఏపి మంత్రాలు ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయం 4వ బ్లాక్‌లోని కార్యాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్‌ బాధ్యతలు స్వీకరించారు. పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఎనిమిది జిల్లాల్లో స్టడీ సెంటర్స్‌ ఏర్పాటు చేసే దస్త్రంపై తొలిసంతకం చేశారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ..మెరుగైన విద్య నందించడమే ప్రభుత్వ లక్ష్యమని, గత ప్రభుత్వం కేటాయించిన నిధుల్లో 10 శాతం కూడా ఖర్చు చేయలేదన్నారు.
గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు తన ఛాంబర్‌లో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. రెవిన్యూ శాఖా మంత్రిగా పిల్లిసుభాష్‌ చంద్రబోస్‌ కూడా మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ..త్వరలోనే కొత్త జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియ చేపడతామన్నారు. భూ సేకరణలో మార్కెట్‌ రేటు ప్రకారం ధరలు చెల్లిస్తామన్నారు. త్వరలో రాష్ట్రంలో భూమలు రి సర్వే చేపడతామని వెల్లడించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/