చంద్రబాబు దీక్షను ప్రజలు నమ్మరు

AP Minister Mopidevi Venkata Ramana
AP Minister Mopidevi Venkata Ramana

Amaravati: తెలుగుదేశం అధినేత చంద్రబాబు దీక్షను ప్రజలు నమ్మరని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు దొంగ దీక్ష, కొంగ జపాలను ప్రజలు నమ్మరని అన్నారు.  టీడీపీ శిబిరాల నుండి కార్యకర్తలు వెళ్ళిపోతే టీడీపీ నేతలు బెదిరించి కూర్చో బెడుతున్నారని అన్నారు. పునరావాస శిబిరాల్లో కూడా పెయిడ్ ఆర్టిస్టులను పెట్టిన సిగ్గు మాలిన రాజకీయం చంద్రబాబుదని మంత్రి మోపిదేవి విమర్శించారు. అచ్చెన్నాయుడు అహంభావంతో పోలీస్ అధికారులను దూషించారని, అచ్చెన్నాయుడు ఇంకా అధికారంలో ఉన్నారని అనుకుంటున్నారని మంత్రి మోపిదేవి అన్నారు. ప్రశాంతంగా ఉన్న పల్నాడులో శాంతి భద్రతల సమస్య సృష్టించాలని చంద్రబాబు చూస్తున్నారని మంత్రి మోపిదేవి వెంకటరమణ విమర్శించారు.