కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసిన బుగ్గన

ఏపికి ఆర్థిక చేయూతను అందించాలి ..బుగ్గన

Buggana Rajendranath-Nirmala Sitharaman

న్యూఢిల్లీ: ఏపి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఈరోజు ఢిల్లీలో కేంద్రం ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ను కలిశారు. ఈసందర్భంగా మంత్రి బుగ్గన ఏపిలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కేంద్రం ఆర్థిక చేయూతను ఇవ్వాలని మంత్రి నిర్మల సీతారామన్‌ను కోరారు. రాష్ట్రానికి రావలిసిన పెండింగ్‌ నిధులపై చర్చించారు. జీఎస్టీ నుంచి రావల్సిన రూ.3500 కోట్ల బకాయిలను వెంటనే ఇవ్వాలని కోరారు. ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు సంబంధించిన రాష్ట్ర ఆదాయం 40శాతం తగ్గిందని వివరించారు.

పోలవరం ప్రాజెక్టు, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు, విభజన చట్టంలోని అభివృద్ధి పథకాలకు నిధులు మంజూరు చేయాలని కోరామని మంత్రి బుగ్గన మీడియాతో తెలిపారు. అభివృద్ధికి సంబంధించిన ప్రతి అంశంపై సిఎం జగన్‌ ఇచ్చిన అన్ని వివరాలను కేంద్ర మంత్రికి సమర్పించామని ఆయన పేర్కొన్నారు. బుగ్గన వెంట ఏపి ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయ్‌ కల్లం, ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్‌, నీటిపారుదల శాఖ కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉన్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/