పవన్ వ్యాఖ్యలపై ప్రజలు ఆలోచించాలి
ఏపి హోంమంత్రి సుచరిత

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపి హోంమంత్రి సుచరిత తీవ్ర విమర్శలు చేశారు. మహిళను అత్యాచారం చేసి కిరాతకంగా హతమార్చిన నిందితులను క్రూరంగా శిక్షించాలని దేశం మొత్తం కోరుకుంటుంటే, రెండు బెత్తం దెబ్బలు చాలన్న పవన్ వ్యాఖ్యలపై మహిళలందరూ ఆలోచించాలని సుచరిత కోరారు. ఒక పక్క చట్టాలను గౌరవించాలని చెబుతూనే, మరోపక్క చర్మం ఊడేట్లు నిందితులను కొట్టాలంటూ పవన్ చేసిన అర్థరహితమని ఆమె విమర్శించారు. పవన్ వ్యాఖ్యలు విని ప్రజలు నవ్వుకుంటున్నారని, ఇలాంటి వారు అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలని అన్నారు. సిఎం జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళల భద్రతకు సైబర్ మిత్ర, మహిళా మిత్ర, బీ సేఫ్ యాప్‌లను అందుబాటులోకి తెచ్చి పెద్దపీట వేశారని సుచరిత తెలిపారు. దిశ ఘటనతో సిఎం జగన్ చలించిపోయారని, రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం ప్రత్యేక ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చే యోచలనలో ఉన్నారని సుచరిత వెల్లడించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/