డాక్టర్ సుధాకర్ ఘటన..పోలీసులపై సీబీఐ విచారణ

కేసును ఈరోజు విచారించిన ఏపీ హైకోర్టు..పోలీసులపై తక్షణమే కేసు నమోదు చేయాలని ఆదేశం

doctor sudhakar – ap high court

అమరావతి: విశాఖలో డాక్టర్ సుధాకర్ పట్ల పోలీసులు అత్యంత అమానుషంగా ప్రవర్తించిన ఆయన బట్టలు విప్పించి, చేతులు వెనక్కి కట్టి, దుర్భాషలాడుతూ, కొట్టిన విషయం తెలిసిందే. అయితే పిటిషన్ పై ఈరోజు హైకోర్టులో వాదనలు జరిగాయి. డాక్టర్ పై జరిగిన దాడిని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఆయనపై దాడి చేసిన పోలీసులపై సీబీఐ విచారణకు ఆదేశించింది. పోలీసులపై సీబీఐ వెంటనే కేసు నమోదు చేసి, విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. 8 వారాల్లోగా నివేదికను అందించాలని సీబీఐ కోర్టును ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై విపక్షాలు మండిపడ్డాయి. మాస్కులు లేవని ప్రశ్నించిన డాక్టర్ ను సస్పెండ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం… ఆయనపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విపక్ష నేతలు మండిపడ్డారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/