స్వర్ణప్యాలెస్‌.. కేసులో ఎఫ్ఐఆర్ పై హైకోర్టు స్టే

ఈ కేసులో తదుపరి చర్యలు నిలిపివేయాలంటూ కోర్టు ఆదేశాలు

ap high court
ap high court

అమరావతి: విజయవాడలోని స్వర్ణప్యాలెస్‌ అగ్నిప్రమాదం వ్యవహారంలో రమేశ్‌ ఆస్పత్రి ఎండీ, ఛైర్మన్‌పై తదుపరి చర్యలు నిలిపివేయాలిని హైకోర్టు ఆదేశించింది. ఈ ప్రమాదం కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ పై హైకోర్టు స్టే ఇచ్చింది.  దీనిపై హైకోర్టులో జరిగిన విచారణలో రమేశ్ ఆసుపత్రి తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. విచారణ సందర్భంగా హైకోర్టు… స్వర్ణ ప్యాలెస్ హోటల్ ను కొవిడ్ కేర్ సెంటర్ గా అనుమతించిన జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, డీఎం అండ్ హెచ్ఓలను ఎందుకు బాధ్యులుగా చేయలేదని ప్రశ్నించింది. స్వర్ణ ప్యాలెస్ ను గతంలో ఎయిర్ పోర్టు క్వారంటైన్ గా సెంటర్ నిర్వహించారా? లేదా? అని అడిగింది.

కాగా విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్ కొవిడ్ కేర్ సెంటర్లో జరిగిన అగ్నిప్రమాదం 10 మందిని కబళించిన సంగతి తెలిసిందే.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/