ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఎదురు దెబ్బ

పిటిషన్‌ తిరస్కరించిన ఏపి హైకోర్టు

AB-Venkateswara-Rao
AB-Venkateswara-Rao

అమరావతి: ఐపీఎస్‌ సీనియర్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌ను ఏపి హైకోర్టు బుధవారం తిరస్కరించింది. ఆయుధాల అక్రమ కొనుగోలు ఆరోపణలపై అరెస్ట్‌ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్‌ను డిస్మిస్‌ చేసింది. కోర్టు ధిక్కరణ కింద పిటిషన్‌ వేయాలని ఏబీకి హైకోర్టు సూచించింది. కేసు నమోదు చేయాలంటే ప్రభుత్వం నిబంధనలను పాటించాలని కోర్టు పేర్కొంది. గైడ్‌లెన్స్‌ను ప్రభుత్వం పాటించకుంటే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

కాగా టిడిపి ప్రభుత్వంలో వెంకటేశ్వరరావు ఇంటలిజెన్స్ ఛీప్‌గా పనిచేశారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇజ్రాయిల్ నుంచి సెక్యూరిటీ పరికరాలు కొనుగోలు విషయంలో నిబంధనలు ఉల్లంఘించారని ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆయనపై వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/