ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగన్‌

botsa satyanarayana
botsa satyanarayana

విజయవాడ: తాడేపల్లిలోని వైఎస్‌ఆర్‌సిపి కార్యలయంలో జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ సమావేశం నిర్వహించారు. అగ్రిగోల్డ్‌ ఎజేంట్లు చంద్రబాబు నిర్వాకం వల్లే చనిపోయరని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ పాదయాత్ర చేసినపుడు అగ్రిగోల్డ్‌ బాధితులు జగన్మోహన్‌ రెడ్డిని కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బాధితులను ఆదుకుంటామని జగన్‌ హామి ఇచ్చారు. ఇచ్చిన హామి ప్రకారం 1150 కోట్లు జగన్‌ ఇచ్చి మాటను నిలబెట్టుకున్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు కోసం జగన్‌ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బొత్స అన్నారు. సీఎం జగన్‌ను కలిసి, బాధితులకు స్వయంగా చెక్‌లు ఇవ్వాలని కోరుతాము అని బొత్స సత్యనారయణ అన్నారు. మాట ఇస్తే రాజశేఖర్‌ రెడ్డి మాట తప్పడు, ఇప్పుడు జగన్‌ కుడా మాట తప్పకుండా అగ్రిగోల్డ్‌ బాధితులకు బాసటగా నిలిచాడని తండ్రి తగ్గ తనయుడని బొత్స అన్నారు. చంద్రబాబు హయంలో అగ్రిగోల్డ్‌ సంస్థ పుట్టింది. ఆయన హయంలోనే స్కాం జరిగింది. ప్రత్యేక హోదా కోసం పోరాటం అంటూ ఢిల్లీ వచ్చిన చంద్రబాబు అగ్రిగొల్డ్‌ ఆస్తులను కాజేయాలని చూశారు.
తాజా క్రీడా వార్తలకోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/