ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన ఏపి గవర్నర్‌

Biswabhusan Harichandan
Biswabhusan Harichandan

విజయవాడ: ఏపి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఈరోజు ఉదయం ప్రభుత్వాసుపత్రిలో వివిధ విభాగాలను పరిశీలించారు. బ్లాక్ నెంబర్ 3వ వార్డ్‌లో రోగులను పరామర్శించారు. ఆరోగ్య శ్రీ వార్డ్స్ ఆరేషన్ థియేటర్లు, సర్జికల్ వార్డ్స్, సర్జికల్ ఐ.సి.యూలను గవర్నర్ పరిశీలించి రోగుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే డయాలసిస్, అల్ట్రా సౌండ్ విభాగం సైతం పరిశీలించి.. కొన్ని సూచనలు చేశారు. ప్రభుత్వాసుపత్రిలో వసతులు సంతృప్తినిచ్చాయన్నారు. పేదలకు అందుతున్న వైద్యంపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. రోగుల కోసం ఎర్పాటు చేసిన ప్రత్యేక వార్డులు భేష్ అని గవర్నర్ కొనియాడారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/