ఇచ్చిన 129 హామీల్లో 77 హామీలు నెరవేర్చాం

ఏపి ఉభయసభల్లో గవర్నర్ ప్రసంగం

ap governor speech-AP Assembly

అమరావతి: ఏపి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈ ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఏపి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తన ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని గవర్నర్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా శరవేగంగా అడుగులు వేస్తున్నదని, ప్రజలకు మేలు కలిగేందుకు ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తున్నదని ఆయన తెలిపారు. ఇచ్చిన 129 హామీల్లో 77 హామీలను ఇప్పటికే నెరవేర్చామని గుర్తు చేశారు. మేనిఫెస్టోలో లేని 40 హామీలను నెరవేర్చామని, మరో 39 హామీలను పరిశీలిస్తున్నామని అన్నారు.

గవర్నర్‌ ప్రసంగంలో ప్రధానంశాలు…

•మేనిఫెస్టోలో లేని 40 హామీలను అమలు చేశాం

•జల, ఖనిజ వనరులను సద్వినియోగం చేసుకుంటున్నాం

•విద్యుత్‌, రవాణా, పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తున్నాం

•అణగారిన వర్గాలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ హక్కులు కల్పించేందుకు చర్యలు

•ప్రజలకు విద్య, వైద్యం అందించేందుకు అత్యంత ప్రాధాన్యత

•మధ్యవర్తుల ప్రమేయం లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం

•ఏడాదిలో రూ.42 వేల కోట్లతో సంక్షేమ పథకాలు

•18 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్

•రాష్ట్రంలో సేవారంగంలో 9.1శాతం వృద్ధి. పారిశ్రామిక రంగంలో 5 శాతం వృద్ధి

•వ్యవసాయ అనుబంధ రంగాల్లో 8 శాతం వృద్ధి

•122 హామీల్లో 77 హామీలు నెరవేర్చాం..39 హామీలు పరిశీలనలో ఉన్నాయి

•మన బడి పథకంలో 15700 స్కూళ్లలో మౌలిక వసతుల కల్పన

•దశల వారీగా మూడేళ్లలో 45 వేల పాఠశాలల అభివృద్ధి

•వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 6.20 లక్షల మందికి సేవలు

•హైదరాబాద్, చెన్నై, బెంగూళూరులోనూ ఆరోగ్యశ్రీ సేవలు

•వైఎస్‌ఆర్‌ కంటి వెలుగుతో 67 లక్షల మంది విద్యార్థులకు పరీక్షలు

•విజయవంతంగా కొనసాగుతున్న వైఎస్‌ఆర్‌ టెలీ మెడిసిన్‌

•నాడు నేడు పథకం కింద ప్రభుత్వ ఆస్పత్రులను జాతీయ స్థాయిలో అభివృద్ధి

•వైఎస్‌ఆర్‌ రైతు భరోసా ద్వారా ప్రతి రైతుకు 13,500 సాయం

•కౌలు రైతులకు కూడా రైతు భరోసా వర్తింపజేస్తున్నాం

•కరువు పరిస్థితుల నుంచి బయటపడేందుకు రూ. 2వేల కోట్ల విపత్తు సాయం

•ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7లక్షల ఎక్స్‌గ్రేషియా

•ఎక్కడా లేని విధంగా 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు

•వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కింద 50 లక్షల మందికి లబ్ధి..ఇంటి వద్దే పెన్షన్‌ అందిస్తున్నాం

•సంక్షేమ పథకాల ద్వారా 3.92 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు

•సూక్ష్మ, చిన్న పరిశ్రమలను ఆదుకునేందుకు రూ.900 కోట్ల సాయం

•గ్రామీణ ఉత్పత్తులు విక్రయించేందుకు త్వరలో వైఎస్‌ఆర్‌ జనతా బజార్‌లు

•ఇళ్ల పట్టాలు, సంక్షేమ పథకాలు మహిళల పేరుతో ఇవ్వడం ద్వారా మహిళా అభ్యున్నతికి చర్యలు చేపడుతున్నాం

•ప్రతి గ్రామంలో వైఎస్‌ఆర్‌ క్లినిక్‌లు

•బలహీనవర్గాల అభ్యున్నతికి 50 శాతం నామినేటెడ్‌ పోస్టులు, పనులు

•అత్యాచారాల నిరోధానికి దిశ చట్టం

•పట్టణాల్లో రక్షిత మంచినీటికి ప్రాధాన్యత ఇస్తున్నాం

•2021 డిసెంబర్‌లోగా పోలవరం పూర్తి

•వచ్చే నాలుగేళ్లలో సాగునీటి ప్రాజెక్ట్‌లు పూర్తి చేస్తాం

•రివర్స్‌ టెండరింగ్ ద్వారా రూ.2200 కోట్లు ఆదా చేశాం

•రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడులో ఓడరేవుల నిర్మాణం

•పోర్టుల నిర్మాణానికి మూడేళ్లలో రూ.3200 కోట్లు

•పెట్టుబడులను ఆహ్వానించేందుకు త్వరలో కొత్త పారిశ్రామిక విధానం

•కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నాం.. రోజుకు 15 వేల టెస్ట్‌లు

•ఇప్పటికే 5.5 లక్షల టెస్ట్‌లు చేశాం

•జాతీయ సగటు కంటే ఏపీలో రికవరీ రేటు అధికం

•38 వేల ఐసోలేషన్ బెడ్స్‌ సిద్ధం.. 1300 వెంటిలేటర్లు ఉన్నాయి

•24 వేల మంది వైద్యులు..24500 మంది పారామెడికల్ సిబ్బంది సేవలు

•గ్రామ వాలంటీర్లు, పోలీసులు సమర్ధవంతంగా పనిచేశారు

•3.2 లక్షల మంది వలస కార్మికుల ప్రయాణ ఖర్చులు భరించాం
వైద్యులు కరోనా కట్టడికి ఎంతో శ్రమిస్తున్నారని తెలిపారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/