ఏపిలో సిబిఐ పునరుద్దరణకు నిర్ణయం

CBI
CBI

అమరావతి: ఏపిలో తనిఖీలు, దర్యాప్తు చేసే అధికారాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ(సిబిఐ)కి కల్పించే సాధారణ సమ్మతిని (జనరల్‌ కన్సెంట్‌) పునరుద్దరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణ సమ్మతిన ఉపసంహరించుకుంటూ గత నవంబరులో టిడిపి ప్రభుత్వం జారీ చేసిన నోటిపికేషన్‌ను రద్దు చేసి సిబిఐ ప్రవేశానికి వీలుగా సవరణ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత కొంతకాలంగా దీనిపై ప్రచారం జరుగుతుండగా తాజాగా ఆదేశాలు వెలువడ్డాయి.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/