కరోనాపై అప్రమత్తమైన ఏపి ప్రభుత్వం

1897 చట్టాన్ని ఉపయోగించాలని ఏపి ప్రభుత్వం నిర్ణయం!

AP CM Jagan
AP CM Jagan

అమరావతి: ఏపిలో కరోన వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. కరోనా నియంత్రణకు కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. కరోనా వైద్యానికి ప్రత్యేక నియంత్రణ ఉత్తర్వులు ఇవ్వనుంది. 1897 చట్టాన్ని ఉపయోగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఎపిడిమిక్ డీసీజెస్ చట్టం కింద నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తోంది. ప్రభుత్వం ఇచ్చే సూచనలను పాటించేలా నోటిఫికేషన్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఈ చట్టాన్ని కేంద్రం అమలు చేస్తోంది. దీంతో ఏపీ ప్రభుత్వం కూడా ఈ చట్టాన్ని అమలు చేయాలని యోచిస్తోంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/