ఏపికి కొత్తగా మరో ముగ్గురు విప్‌లు

ramakrishna reddy, udaya bhanu, ramachandrareddy
ramakrishna reddy, udaya bhanu, ramachandrareddy

అమరావతి: ఏపి ప్రభుత్వం కొత్తగా మరో ముగ్గురిని ప్రభుత్వ విప్‌లుగా నియమిస్తూ ఏపి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. సామినేని ఉదయభాను(జగ్గయ్యపేట), పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(మాచర్ల), కాపు రామచంద్రారెడ్డి(రాయదుర్గం) లకు ప్రభుత్వ విప్‌లుగా అవకాశం కల్పించారు.
అంతకు ముందు చీఫ్‌ విప్‌గా శ్రీకాంత్‌రెడ్డి ముత్యాలనాయుడు (మాడుగుల), దాడిశెట్టి రాజా(తుని), చెవిరెడ్డి భాస్కరరెడ్డి(చంద్రగిరి), శ్రీనివాసులు(రైల్వే కోడూరు) విప్‌లుగా నియమితులైన విషయం తెలిసిందే. కొలుసు పార్ధసారథిని విప్‌ బాధ్యతల నుంచి తొలగించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/