ఇసుక విధానంలో ఏపి ప్రభుత్వం కీలక నిర్ణయం

sand policy
sand policy

అమరావతి: కొత్త ఇసుక విధానంలో రవాణా టెండర్లను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిన్న అర్ధరాత్రి రాష్ట్ర గనుల శాఖ ఆదేశాలు జారీ చేసింది. కిలోమీటర్ కు ఇసుక తరలింపుకు అతి తక్కువ ధర కోట్ చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లా మొత్తానికి ఒకే కాంట్రాక్టర్ ఉంటే ఇబ్బందులు వస్తాయని ప్రభుత్వం భావించింది. మరోవైపు, జీపీఎస్ ఉన్న ట్రక్కుల యజమానులు దరఖాస్తు చేసుకుంటే… వారికి అవకాశం ఇస్తామని తెలిపింది. కిలోమీటరు రవాణాకు రూ. 4.90 ఖరారు చేసినట్టు వెల్లడించింది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/