రాజమండ్రి రైల్వేస్టేషన్లో నిలిచిన ఏపీ ఎక్స్ ప్రెస్

AP Express
AP Express

Rajahmundry: ఢిల్లీ నుండి విశాఖ వెళ్తున్న ఏపీ ఎక్స్ ప్రెస్ రాజమండ్రి రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. గంటకు పైగా ట్రైన్ నిలిచిపోగా ఏసీలు కూడా పనిచేయకపోవడంతో ఉక్కపోతతో ప్రయాణికులు ఆందోళలకు దిగారు. ఈమధ్య కాలంలోనే ఏపీ ఎక్స్ ప్రెస్ నిర్వహణపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేయగా ఈరోజు మళ్ళీ అదే పరిస్థితి అయిందంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతవారం గోదావరి ఎక్స్ ప్రెస్ లో ఫ్యాన్లు పనిచేయడం లేదని ఆందోళన వ్యక్తం చేయగా, ఇన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని, స్లీపర్ క్లాస్ బోగీల్లో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కించడంతో ఏసీలు సరిపోవడం లేదని, సగానికిపైగా ప్రయాణికులు అధికంగా ఎక్కిస్తున్నారని, వేసవిలో తగిన వసతులు కల్పించడంతో అధికారులు తీవ్రంగా విఫలమయ్యారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.