ఈఎస్‌ఐ కుంభకోణానికి అచ్చెన్నాయుడు బాధ్యత వహించాలి

పేద కార్మికుల పొట్ట కొట్టిన ఆయనను వెంటనే అరెస్టు చేయాలి

goutham reddy
goutham reddy

తాడేపల్లి: ఈఎస్‌ఐ కుంభకోణానికి మాజీ కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు బాధ్యత వహించాలని వైఎస్‌ఆర్‌సిపి ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షుడు పునూరు గౌతమ్‌ రెడ్డి అన్నారు. పేద కార్మికుల పొట్ట కొట్టిన అచ్చెన్నాయుడును వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈఎస్‌ఐలో వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దోపిడీకి గురైన సొమ్మునంతా అవినీతి పరుల నుంచి రప్పించాలని పేర్కొన్నారు. మేము గతంలోనే చెప్పాం ఈఎస్‌ఐ హాస్పిటల్స్‌లో అవినీతి జరగుతుతోందని, ఇప్పుడు విజిలెన్స్‌ నివేదిక ద్వారా అదే నిజమైందని తెలిపారు. అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా టిడిపి మారిందని విమర్శించారు. మంత్రిగా అచ్చెన్నాయుడు ఒత్తిడి మేరకే మూడు కంపెనీలకు నామినేషన్‌ పద్దతిలో కాంట్రాక్టు ఇచ్చారని అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/