ఏపి ఎంసెట్‌ కోడ్‌ విడుదల

AP eamcet 2019
AP eamcet 2019


అమరావతి: ఏపిలో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, బీఫార్మసి, డీ ఫార్మసి తదితర కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఏపి ఎంసెట్‌-2019 పరీక్షలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉన్నత విద్యాశాఖ కౌన్సిల్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ విజయరాజు ఈ ఉదయం పరీక్షా పత్రం కోడ్‌ విడుదల చేశారు. జేఎన్టీయూలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఇంజనీరింగ్‌ పరీక్ష సెట్‌ కోడ్‌ ఈజి-18ని లాటరీ ద్వారా ఎంపిక చేశారు. ఈ నెల 23న ఇంజనీరింగ్‌ ప్రాథమిక కీ, ఈ నెల 24న వ్యవసాయ, వైద్య విభాగం పరీక్షల ప్రాథమిక కీ విడుదల చేస్తామన్నారు. మే రెండో వారంలో పరీక్ష ఫలితాలు వెల్లడించేందుకు ప్రయత్నిస్తామని రామలింగరాజు చెప్పారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/