ఏపి ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాసిన సీఎస్

స్థానిక ఎన్నికలను నిర్వహించండి…అధికార యంత్రాంగం పూర్తి సన్నద్ధం

ap-cs-letter-sec-ramesh-kuma
ap-cs-letter-sec-ramesh-kuma

అమరావతి: ఏపిలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ వాయిదా వేసిన నేపథ్య్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని లేఖ రాశారు. స్థానిక ఎన్నికలను కొనసాగించాలని, ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం పూర్తి సన్నద్ధంగా ఉందని పేర్కొంటూ, ఈసీకి ఆమె లేఖ రాశారు. కరోనా పేరు చెప్పి, ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఆమె కోరారు. రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలు, ఉద్యోగులు ఎన్నికల నిర్వహణకు సన్నద్ధమేనని ఆమె స్పష్టం చేశారు. బ్యాలెట్ బాక్సుల సేకరణ, ఓటర్ల జాబితా, ఓట్ల ముద్రణ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాయని పేర్కొన్న ఆమె, ప్రజారోగ్యం బాధ్యత ప్రభుత్వానిదని, కోవిడ్19 వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందని ఆమె పేర్కొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/