ఏపిలో ముఖ్య అధికారుల బదిలీలు!

Jagan
Jagan

అమరావతి: ఏపి సిఎంగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే జగన్‌ పాలనపై చర్యలు ప్రారంభించారు. ఈ సందర్భంగానే ముఖ్యమంత్రి కార్యాలయంలో కొనసాగుతున్న నలుగురు ముఖ్య అధికారులు బదిలీ చేస్తూ సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. సీఎంవో ప్రత్యేక కార్యదర్శిగా కొనసాగుతున్న సతీశ్‌ చంద్ర, సీఎంవో ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్‌, ముఖ్యమంత్రి కార్యదర్శులుగా వున్న గిరిజాశంకర్‌, అడుసుమిల్లి రాజమౌళిని బదిలీ చేశారు. వీరందరినీ సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాలని సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం ఆదేశాలు జారీచేశారు. అంతేకాక టూరిజం శాఖ ఎండీగా పనిచేస్తున్న ధనుంజయ్‌ రెడ్డిని సీఎం అదనపు కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/