వైద్య ఆరోగ్యశాఖ పనితీరు పట్ల సిఎం అసంతృప్తి

cm Jagan
cm Jagan

అమరావతి: ఏపి సిఎం జగన్‌ నిన్నటి నుండి శాకలవరీగా సమీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈరోజు ఉదయం ఆయన వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యశాఖ పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్యశాఖ పనితీరు ఏమాత్రం బాగాలేదని, శాఖ పనితీరు మెరుగుపరచాలంటే సమాల ప్రక్షాళన తప్పదని అభిప్రాయపడ్డారు. దేశంలోనే ఆదర్శవంతమైన విధానాలు అమలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రధానంగా, పేదవారికి నాణ్యమైన వైద్యసేవలు అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని వివరించారు. వైద్య ఆరోగ్యశాఖ సమూల ప్రక్షాళన కోసం కమిటీ ఏర్పాటుచేస్తున్నట్టు జగన్ వెల్లడించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/