రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ

ఏపీ సీఎం వైఎస్‌ జగన్

Amaravati: భవిష్యత్తులో రైతుభరోసా కేంద్రాలు ఆర్‌బీకేలు ధాన్యం సేకరణకు కూడా పూర్తి స్థాయిలో కేంద్రాలుగా నిలవాలని సిఎం వైఎస్‌ జగన్‌ అన్నారు.

రైతులు ఎక్కడ ఏ పంట వేయకూడదో పక్కగా చూసుకోవాలని కూడా అన్నారు.

దీన్ని సీరియస్‌గా ఎన్‌ఫోర్స్‌ చేయాలి. ఆ మేరకు వారికి సలహా ఇవ్వాలి. ఏ పంట వేస్తే లాభం దేనికి ధర ఉంది వంటి అన్ని అంశాలపై రైతులకు చెప్పడంతో పాటు, ఆ తర్వాత వారికి అంతే డబ్బు వచ్చే మార్గం చూపాలన్నారు.

పంటలు పండిన తర్వాత మార్కెటింగ్‌ ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు.

వీటన్నింటినీ జాయింట్‌ కలెక్టర్లు చూడాలని నిర్దేశించారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, సన్నద్ధతపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌వెూహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సవిూక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో చోటు చేసుకున్న ఘటనలు ఎక్కడా పునరావృతం కాకూడదని, ఎట్టి పరిస్ధితుల్లో ఏ సమస్యలు రాకూడదని అధికారులకు స్పష్టం చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/