ఏపికి ప్రత్యేక హోదా వస్తుంది..సిఎం జగన్‌

హోదా వస్తే ప్రోత్సాహకాలు మెండుగా ఉండేవి

cm jagan

అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి సర్కార్‌ ఏర్పడి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ‘మన పాలన-మీ సూచన’ అంశంపై పారిక్రశామికాభివృద్ధిపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా సిఎం జగన్‌ మాట్లాడుతూ..ఏపికి ప్రత్యేక హోదా సాధిస్తామని ఆయన అన్నారు. హోదా వస్తే ప్రోత్సాహకాలు మెండుగా ఉండేవని, ఇవాళ కాకపోతే రేపయినా వస్తుందని ఆయన స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాల్లో రాష్ట్రం మెరుగ్గా ఉందని, రాష్ట్రంపై కేంద్రం ఆధారపడే రోజులు వస్తాయని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపికి ప్రత్యేక హోదా వస్తే ఎన్నో కంపెనీలు వచ్చేవని, గత టిడిపి ప్రభుత్వం హోదాను తీసుకురాలేకపోయిందని జగన్ విమర్శించారు. మరోవైపు, గత లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి పూర్తి మెజార్టీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని, లేదంటే ఆ పార్టీకి మద్దతిచ్చే క్రమంలో ప్రత్యేక హోదా డిమాండ్‌ చేసేవాళ్లమని చెప్పారు.

అయితే, భవిష్యత్‌లో మాత్రం కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే బిజెపి ఇతర పార్టీలపై ఆధారపడే పరిస్థితి వస్తుందని, తాము అప్పుడు హోదా డిమాండ్ చేస్తామన్నారు. గత టిడిపి ప్రభుత్వం గ్రాఫిక్స్‌ చూపించి ప్రజలను మోసం చేసిందని, ఈజ్‌ ఆఫ్ డూయింగ్‌ బిజినెస్‌లో తొలి ర్యాంక్‌ అంటూ గొప్పగా చెప్పుకుందని తెలిపారు.పారిశ్రామిక రంగానికి భూములు ఇచ్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని జగన్ తెలిపారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/