సిఈఓకి చంద్రబాబు ఫిర్యాదు

gopala krishna dwivedi, ap cm
gopala krishna dwivedi, ap cm


అమరావతి: ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ సియం చంద్రబాబు ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన అధికారి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గోపాలకృష్ట ద్వివేదిని బుధవారం కలిసి వినతి పత్రం అందజేశారు. కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన 9 పేజీల లేఖ కూడా సమర్పించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, పార్టీ అధినేతగా ఈ విషయంపై ఆవేదన కలుగుతుందని అందులో వివరించారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/