నేడు, రేపు కపడలో పర్యటించనున్న సిఎం

రేపు దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా పర్యటన

AP CM YS Jagan
AP CM YS Jagan

అమరావతి: ఏపి సిఎం జగన్‌ ఈరోజు, రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు. రేపు దివంగత నేత, మాజీ సిఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా ఆయనకు సిఎం జగన్ నివాళులు అర్పించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు, అక్కడి నుండి ప్రత్యేక విమానంలో సిఎం జగన్ కడప చేరుకోనున్నారు. సాయంత్రం 4.55 గంటలకు కడప ఎయిర్పోర్ట్ నుండి ఇడుపులపాయకు హెలికాప్టర్‌లో వెళ్లనున్నారు. నేడు ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఎస్టేట్స్‌లోని గెస్ట్ హౌస్‌లో సిఎం జగన్ బస చేయనున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/