అమిత్‌ షాతో జగన్‌ మరోసారి భేటి

కేంద్రం నుంచి అందాల్సిన సాయంపై చర్చ

cm-jagan-central-minister-amit-shah

న్యూఢిల్లీ: ఏపి సిఎం జగన్‌ ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ‌ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో సిఎం జగన్ రెండోసారి సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఆయన చర్చించారు. అమిత్‌ షాతో జగన్‌ నిన్న సాయంత్రం కూడా సమావేశమైన విషయం తెలిసిందే. ఏపి పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనల ప్రకారం‌ కేంద్రం నుంచి అందాల్సిన సాయంపై చర్చించినట్లు సమాచారం. మరోవైపు, ఈ రోజు ఉదయం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో జగన్ భేటీ అయ్యారు. పోలవరంతో పాటు పలు ప్రాజెక్టులకు కేంద్ర సహకారంపై ఆయన దాదాపు 20 నిమిషాల పాటు చర్చించారు.

ఏపిలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు నిధులు అందించాలని వారు కోరారు. పోలవరం ప్రాజెక్ట్ పర్యటనకు రావాలని షెకావత్‌ను సిఎం జగన్‌ కోరారు. దీంతో త్వరలోనే తానే పోలవరం పర్యటనకు వస్తానని ఆయన హామీ ఇచ్చారు. గోదావరి, కావేరి నధుల అనుసంధానంపైన కూడా వారి మధ్య చర్చ జరిగింది. సిఎం జగన్‌ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి కూడా ఉన్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/