కేంద్రం చేతిలో ఇసి కీలుబొమ్మ!

ఏకపక్ష నిర్ణయాలతో ప్రజాస్వామ్యాన్ని పాతరేశారు
సిఇఒ ఆఫీస్‌ వద్ద సిఎం చంద్రబాబు
ధర్నా

AP CM Chandra babu Stage Dharna at EC CEO Office
AP CM Chandra babu Stage Dharna at EC CEO Office


సచివాలయం,: కేంద్రప్ర భుత్వం చేతుల్లో ఎన్నికల సంఘం కీలు బొమ్మగా మారిందని సిఎం చంద్రబాబు నిరసన వ్యక్తంచేశారు.ఈ మేరకు బుధవారం ఎన్నికల సంఘం తీసుకొన్నఏకపక్ష నిర్ణయాలకు సంబం ధించిన వివరాలను రాష్ట్రఎన్నికల ప్రధా నాధి కారి గోపాలకృష్ణ ద్వివేదిని కలసి ఫిర్యాదు చేశారు.రాష్ట్రంలో ఇటీవల జరిగిన పరిణామా లపై తీవ్రంగా స్పందించాల్సిన అవ సరంఉందని ఇష్టారాజ్యంగా చేస్తుంటే చేతులు ముడుచుకొని కూర్చోవాల్సిన అవసరం లేదన్నారు.గతంలో ఎన్నడూ లేనివిధంగా కేంద్ర ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ 60మంది ఉన్నతాధికారులు రాష్ట్రపతిని కలవడంపై సిగ్గుపడాల్సిన అవసరం ఉంద న్నారు.మోదీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ కొమ్ముకాస్తూ వారు చెప్పిన వారందరిని బదిలీ చేయడంపై ఆయన మండిపడ్డారు.అయితే మేము ఇచ్చిన ఫిర్యాదులపై ఒక్కసారి కూడా స్పందించలేదని ఎక్కడా చర్యలు కూడా తీసుకోలేదన్నారు.ఒకపార్టీకి కొమ్ముకాయడంపై రాష్ట్ర ఇసి తీరును తప్పు పట్టాల్సిన అవసరం ఉందన్నారు.కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వా లకు సంబంధించిన అంశాలపై అధికార ప్రభుత్వానికి,అధికారులకు వ్యతిరేకంగా పక్షపాతంలో వ్యవహరించిన తీరును మీడియాకు వివరించారు.వి.వి.ప్యాట్‌లు 50శాతం లెక్కించాలని 22పార్టీలతో కలసి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని స్పందించక పోవడంతో కోర్టును ఆశ్రయించామన్నారు.వైసీపీలో అవినీతిపరులు ఉన్నప్పటికి వారిపై ఎలాంటి దాడులు జరగడం లేదన్నారు.టిడిపికి చెందిన ముఖ్యనేతల ఇళ్ళపై ఐటి దాడులు చేయిస్తూ భయభ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు.
లోటస్‌పాండ్‌లో కూర్చొనిజగన్‌ అధికారులను బదిలీ చేయిస్తున్నారని ఆ అధికారులు ఎంతోమనోవేదనకు గురవుతారో ఇసి అర్థంచేసుకోవాలన్నారు. మోడీ పాలనలో అన్నిశాఖలు భ్రష్టుపట్టించారని కె.కె.శర్మను అన్ని రాష్ట్రాలు వద్దని చెప్పారని అయితే ఏపికి ఎలా పనికివస్తాడని ఈ విషయంపై కేంద్రమే జవాబుదారీగా ఉండాలన్నారు.పార్టీకి కొమ్ముకాసే వ్యక్తులను మారాష్ట్రాలకు పంపుతూ మాప్రభుత్వంలోని అధికారులను బదిలీ చేయడం సరికాదన్నారు. ఎన్నికలు నిష్ఫక్షపా తంగా నిర్వహించాల్సిన ఇసి అప్రజా స్వామ్యంగా నిర్వహించే తీరు కనిపిస్తుంద న్నారు. టిడిపి శ్రేణులు సీపీఐ శర్మపై ఫిర్యాదుచేసినా ఈసీ ఎందుకు చర్యలు చేపట్టలేదని ప్రశ్నించారు.కేంద్రంతో వచ్చి ప్రచారం చేసుకొన్నా మాకు ఈసీపై అభ్యంతరం లేదని అన్ని తెలుగుప్రజలు గమనిస్తు న్నారన్నారు.