పార్టీ శ్రేణులంతా సైనికుల్లా పోరాడాలి

AP CM Chandra babu in Tele Conference
AP CM Chandra babu in Tele Conference

Amaravati: ఎన్నికల యుద్ధానికి ఇంకా రెండ్రోజులే ఉందని, తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా సైనికుల్లా పోరాడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు సూచించారు. ఎలక్షన్‌ 2019పై పార్టీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడారు. కార్యకర్తల కష్టానికి, త్యాగానికి తగిన గుర్తింపు ఇస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల భద్రత తన బాధ్యత అన్నారు. ప్రభుత్వ పని తీరు బాగుందని 68-76 శాతం ఉందని, అన్ని సర్వేలు టీడీపీ గెలుపునే నిర్ధారిస్తున్నాయన్నారు. ఓటింగ్‌ యంత్రాలు ఈవీఎంలపై ఓటర్లలో అవగాహన పెంచాలని సూచించారు.