వారి కుట్రలు సాగనివ్వను


ఐటిగ్రిడ్‌ కంపెనీలపై దాడి చట్టవిరుద్ధం..
ఇంతటి దారుణ కుట్ర ఇప్పటిదాకా చూడలేదు
ఆ మూడు పార్టీలు ‘బాహుబలికంటే పెద్ద కుట్రనే చేశాయి:
మీడియాతో సిఎం చంద్రబాబు

AP CM CHANDRA BABU with Media
AP CM CHANDRA BABU

అమరావతిµ : హైదరాబాదులోని ఐటిగ్రిడ్‌ డేటాచోరీ కుట్ర ఢిల్లీలోనే పక్కాస్కెచ్‌తో జరిగిందని టిడిపి జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. శనివారం మధ్యాహ్నం ఉండవల్లి ప్రజావేదికలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఐటిగ్రిడ్‌ కంపెనీపై దాడులుచేయడం చట్ట విరుద్ధమని స్వాతంత్య్రం తర్వాత ఇలాంటి కుట్రలు తామేన్నడూ చూడలేదని దొంగతనం చేసినవారు దొరక్కుండా పోయారని బాబు ఆరోపించారు. కుట్ర, కుతంత్రాలు సాక్ష్యాధారాలతో సహా దొరికాయని చరిత్రలో ఎన్నోకుట్రలు జరిగాయని అయితే ఈ తరహా కుట్రలు ఎక్కడా జరగలేదని బాబు స్పష్టం చేశారు.ఐటిగ్రిడ్‌పై ఫిర్యాదుకు ముందే దాడులు చేసినట్లు హైదరాబాద్‌ సిట్‌కు సారధ్యం వహిస్తున్న ఐపిఎస్‌ అధికారి స్టీఫెన్‌ రవీంద్ర స్పష్టంచేసిన వ్యవహారంపై బాబు గుర్తుచేశారు.ఐటిగ్రిడ్‌పై ఫిర్యాదు చేయమని మీకేమైనా కలవచ్చిందా..రాజకీయ పార్టీలకే మనుగడ లేకపోతే సామాన్యుల పరిస్థితేంటని బాబు ప్రశ్నించారు.ఐటిగ్రిడ్‌లో సేవామిత్రి, ఇన్సురెన్స్‌ సమాచారాన్ని ఎత్తికెళ్లారని ఏదైనా సినిమాలో రెండున్నరగంటలపాటు నేడు సమాజం ఎటుపయనిస్తోందో మంచి చెడులను చెప్పె సినిమారంగంలో బాహుబలి సినిమా కంటే ఆ మూడు పార్టీలు మహాకుట్రచేసి చరిత్ర ద్రోహులుగా మిగిలిపోతున్నారని బాబు మండిపడ్డారు.

డేటా చోరీ కుట్ర మోడీతో లాలూచీపడి కెసిఆర్‌, జగన్‌ చేసినదే. ఆస్తులైనా అమ్ముకుంటాం కానీ ఆత్మగౌరవం వదలం: -సిఎం చంద్రబాబు

అన్ని రాజకీయపార్టీలకు ఉన్న విధివిధానాల ద్వారా తమ పార్టీకి సంబంధించిన సమాచారాన్ని భద్రపర్చుకోవడం సహజమని తాము అదేతరహాలో భద్రపరుచుకుంటే కేసీఆర్‌,కేటిఆర్‌ వాటిని చోరీచేసి జగన్‌కుఇచ్చి ఢిల్లీనుంచి జగన్‌ ఆడిననాటకాలతో తమ సమాచా రాన్ని లూటిచేసే తెలంగాణా ప్రభుత్వం డెకాయిట్‌ ప్రభు త్వమా అయితే తమడేటాపై ఎవరు ఫిర్యాదు ఇచ్చారో.. ఎక్కడ ఇచ్చారో ఏదీ స్పష్టం చేయకుండా ఫిర్యాదు ఇవ్వకుండా దొంగతనానికి పాల్పడ్డారని ఒకవేళ డేటా పోయిందంటే అర్థరాత్రి ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేస్తారా ఏపి ప్రభుత్వ డేటాపోతో మాకు ముందు ఎందుకు చెప్పలేదని మా డేటా దొంగిలించి మాపైనే కేసులు పెడతారా న్యాయస్థానాన్ని కూడా తప్పుదారిపట్టిస్తూ తెలంగాణా ప్రభుత్వం వైఎస్సార్సీ అధినేత జగన్మోహనరెడ్డి కోసం తెలంగాణా మోడీ, ఢిల్లీ మోదీలు కుట్ర చేశారని తీవ్రంగా వారిపై మండిపడ్డారు. సంజీవరెడ్డినగర్‌ పోలీస్టేషన్‌లో దినేష్‌రెడ్డి అనే వ్యక్తి ఎందుకు ఫిర్యాదు చేశారని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి డైరెక్షన్‌ తెలంగాణా పోలీసులు నాటకమాడారని ఈ కుట్రలన్నీ ఢిల్లీనుంచే మొదలు పెట్టారని బాబు స్పష్టంచేశారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీ అధినేతకు ఓటువేస్తే ఏపి కెసిఆర్‌కు కప్పం కట్టాల్సి వస్తుందని బాబు పేర్కొన్నారు.ఒకప్పుడు నిజాంకు అలా కప్పం కట్టేవారని వైఎస్సార్సీ అభ్య ర్థుల జాబితా కూడా హైదరాబాదులోనే సిద్ధం అవుతుందని తెలంగాణాలో వైఎస్సార్సీ కార్యకలాపాలు పూర్తిచేసి అభ్యర్థులను ఎంపికచేసి ఆ ఆభ్యర్థులు ఎపిలో ఓట్లు అడుగుతున్నారని ఏపిలో ఓట్లను తీసేసిన టెక్నాలజీని జగన్‌కు ఇచ్చారని సామంతరాజ్యం కోసమే కేసీఆర్‌ ఏపిలో పెట్టుబడులు పెడుతున్నారని ఈ నేపధ్యంలో ఏపిలో వైసీపీనేత జగన్‌ను కేసీఆర్‌ ఏర్పాటుచేసుకున్నారని బాబు ఆరోపించారు.ఐగు కోట్ల ఏపి ప్రజల మనోభావాలను దెబ్బతీస్తు ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన వ్యవహారం అని బాబు గుర్తుచేశారు.కేసీఆర్‌,జగన్‌,మోదీలు కుట్రలు పన్నితే ఆ కుట్రలు సాగనివ్వనని హైదరాబాద్‌నుంచి ఈ కుట్రలు కుతంత్రాలుచేస్తే తాము చూస్తూ ఊరుకోమని కబడ్దార్‌ అని హెచ్చరించారు.టిడిపి ఔట్‌సోర్సింగ్‌ చేశారనే నెపంతో ఐటిగ్రిడ్‌పై దాడులు చేసి విఆర్వోచేత తెల్లపేపర్లలో సంతకాలు పెట్టించుకొని ఐటిగ్రిడ్‌ ఉద్యోగులను కిడ్నాప్‌చేసి కోర్టుకు తప్పుడు వివరాలు సమర్పించారని చట్టం చూస్తూ ఊరుకుండదని మీ రాష్ట్రానికి ఒకచట్టం మారాష్ట్రానికి మరోచట్టం కాదని కుట్రలు కుతంత్రాలు ఎదుర్కొనే దమ్ము ధైర్యం తమకుందని చట్టపరంగా, న్యాయపరంగా తాము ఎదుర్కొంటామని ఆత్మగౌరవాన్ని చంపుకొని తాము పనిచేయలేమని ఆస్తులైనా అమ్ముకుంటామే కానీ ఆత్మగౌరవాన్ని అమ్ముకోమని ఆ ముగ్గురు మోదీలను ఎదుర్కొనే శక్తిని ధైర్యాన్ని ఏపి ప్రజలు ఇచ్చారని బాబు పేర్కొన్నారు.జగన్‌ కేసీఆర్‌తో లాలూచి పడినా కేసీఆర్‌, మోదీ, జగన్‌లు ఒక్కటైనా వారి పప్పులు ఏపిలో ఉడకవని ఓట్ల వ్యవహారం,ఫారం 7 వ్యవహారం ఏపికి చెందినవని ఏపిలో ఎన్నికల కమీషన్‌,ఏపి పోలీసులు, చట్టం ,రాజ్యాంగం తమ పనులు చేసుకుని పోతుంటాయని తప్పుచేసిన వారిపై కఠినచర్యలు తప్పవని ఏపిపై తెలంగాణా ప్రభుత్వం పెత్తనం ఎంటని తెలంగాణా ప్రభుత్వానికి ఏపి ప్రభుత్వంతో ఏంసంబంధమని తెలంగాణా పోలీసులు తెలంగాణాలో దర్యాప్తుచేసుకో వచ్చని,తెలంగాణా అధికారులు ఏపిలో ఓవరాక్షన్‌చేస్తూ వారిపెత్తనం ఏపిలో సాగదని జగన్‌,కెసీఆర్‌లకు ఏపి ప్రజలు బుద్ధిచెబుతారని బాబు హెచ్చరించారు.
తనవద్ద మంత్రిగా చేరి తెలుగుదేశం పార్టీ రాజకీయ భవిష్యత్తు ఇస్తే తన జిమ్మిక్కులు,తన కుట్రలు ఏపిపై ప్రయోగిస్తే తమ తడాఖా చూపుతామని హెచ్చరించారు.ఏపి సిట్‌ ఫారం 7 ద్వారా ఓట్ల తొలగింపుకు చేస్తున్న దరఖాస్తులపై విచారణ మొదలుపెట్టిందని ఓట్ల తొలగింపుకు ఎవరూ పాల్పడ్డారో ఆకుట్రలు హైదరాబాద్‌,ఢిల్లీల్లో జరిగినట్లు ఇప్పటికే ఏపి సిట్‌ పోలీసు అధికారులు గుర్తించారని చట్టపరంగా న్యాయపరంగా ఏపి పోలీసులు చర్యలు తీసుకుంటారని కేసీఆర్‌,జగన్‌లు చేసిన కుట్రలు ఏంటో ఏపి సిట్‌ బృందం నిర్ధారిస్తుందని బాబు స్పష్టంచేశారు.తామెన్నడూచట్టాన్ని చేతుల్లోకి తీసుకోలేదని అధికారం కోసం అడ్డదారులు తొక్కలేదని తెలంగాణాలో ప్రతిపక్షం అడ్డుతొలగించేందుకు పన్నిన కుట్రలు గత ఎన్నికల్లో తెలంగాణా రాష్ట్ర సమితి అక్రమంగా ఓట్లు తొలగించి అధికారంలోనికి వచ్చిన విధంగా ఏపిలో ఆఫార్ములా ఉపయోగించి జగన్మోహనరెడ్డికి సహకరించాలనుకుంటూ ఆ కుట్రలు ఏపిలో ఎండగడతామని బాబు స్పష్టంచేశారు.ఇకపోతే ఈ కుట్ర ఢిల్లీనుంచి మొదలుపెట్టడంతోపాటు ఢిల్లీలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేసినప్పటి నుంచి పధకం ప్రకారం టిడిపి ప్రభుత్వం పై ,పార్టీపై ఫిర్యాదుచేస్తూ వస్తున్నారని ఫిర్యాదుల్లో చేసిన విధంగానే ఈసికి ఇచ్చిన నోటుతోపాటు వీళ్ళ ప్రణాళిక రాసుకున్న పత్రాలను కూడా ఈసీకి ఇచ్చారని వారు ఎంచుకున్న యాక్షన్‌ ప్లాన్‌తో అడ్డంగా దొరికి పోయారని ఆతర్వాతనే హైదరాబాద్‌ ఐటిగ్రిడ్‌పై సోదాలు చేశారని ఐటి సీఈవో అశోక్‌ను విచారించారని అక్కడ ఉద్యోగస్తులను అదుపులోనికి తీసుకొని వారి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేశారని ఐటిగ్రిడ్‌ నుంచి మా డేటాను పూర్తిగా తీసుకెళ్ళారని ఆడేటాకు సంబంధించిన ప్రతి వివరం తెలంగాణా పోలీసులు వైసీపీకి కట్టబెట్టారని ఈ కుట్రలన్నీ వైసీపీ, టిఆర్‌ఎస్‌లు కలిసే చేశారని ఐటిగ్రిడ్‌పై దాడులుచేసిన వాటన్నింటిని చిత్రీకరించడం ఎవరెవరు దాడుల్లో పాల్గొన్నారనేది నిర్దారించామని బాబు గుర్తుచేశారు.విజయసాయిరెడ్డి దర్శకత్వంతో ఈనెల 2వ తేది అర్ధరాత్రి తెలంగాణా పోలీసులకు ఫిర్యాదు అందిందని మరుసటిరోజు తెల్లారే కంపేనీలు సోదాచేశామని ఆ కంపెనీ ఉద్యోగుల ఆచూకి కోసం ఐటిగ్రిడ్‌ కంపెనీ యజమాని హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలుచేసిందని దీంతో నలుగురు ఉద్యోగులను అప్పగించారని సైబరాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ విసి సజ్జనార్‌ అక్కడ విలేకర్ల సమావేశంలో ఆ సంఘటన వ్యవహారాలను పూర్తిగా మీడియాకు చెప్పలేదని అయితే గతనెల 23న ఐటిగ్రిడ్‌పై దాడిచేసింది నిజమేనని తెలంగాణా సిట్‌ బృందానికి సారద్యం వహిస్తున్న స్టీఫెన్‌ రవీంద్ర ఒప్పుకున్నారని కేసు ఈనెల 2న నమోదుచేసి గతనెల 23న ఐటిగ్రిడ్‌పై దాడిచేసిన వ్యవహారాన్ని విచారించడం ఏంటని బాబు కెసిఆర్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

https://epaper.vaartha.com