మరికాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు

సీఎం జగన్ అధ్యక్షతన కాసేపట్లో కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నట్లు సమాచారం. వచ్చే నెలలో అమలు చేయనున్న సంక్షేమ పథకాలతో పాటు టెట్, డీఎస్సీ నోటిఫికేషన్లకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే పలు పెట్టుబడుల ప్రాజెక్టులకు, వైద్యారోగ్యశాఖలో ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటె ఫిబ్రవరి 5 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు కాబట్టి 3 నుంచి 5 రోజులు నిర్వహించే అవకాశం ఉంది. సుమారు రూ.75 వేల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను రూపొందించనున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్లో సంక్షేమ, అభివృద్ధి పథకాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమాచారం.