ప్రారంభమైన ఏపి మంత్రివర్గ సమావేశం

రాజధాని అంశంపై చర్చరాజధాని అంశంపై చర్చ

AP CABINET MEETING
AP CABINET MEETING

అమరావతి: సిఎం జగన్‌ నేతృత్వంలో సచివాలయంలో ఏపి మంత్రి వర్గ సమావేశం ప్రారంభమైంది. రాజధాని అంశం, జీఎన్ రావు నిపుణుల కమిటీ నివేదికపై కేబినెట్ ప్రధానంగా చర్చించనుంది. మూడు రాజధానులపై మంత్రి వర్గంలో కీలకంగా చర్చించే అవకాశం ఉంది. జీఎన్ రావు కమిటీ ఇటీవల ఇచ్చిన నివేదికకు మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. అలాగే, ఈ మంత్రి వర్గ సమావేశంలో అమరావతి అభివృద్ధి, రిటర్నబుల్ ప్లాట్ల అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. రాజధానికి భూములిచ్చిన రైతుల అంశం, వారి ఆందోళన, సీఆర్డీఏ వ్యవహారాలపై కూడా మంత్రులు చర్చించనున్నారు. కర్నూలులో వెటర్నరీ పాలిటెక్నిక్ ఏర్పాటు, ఏపీఐఐసీ ద్వారా వివిధ సంస్థలకు భూకేటాయింపులు వంటి పలు కీలక అంశాలపై కూడా చర్చ కొనసాగే అవకాశం ఉంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/