ప్రారంభమైన ఏపి కేబినెట్‌ సమావేశం

ap cabinet meeting
ap cabinet meeting

అమరావతి: ఏపి మంత్రివర్గం సమావేశం ప్రారంభమైంది. సిఎం జగన్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రులు సమావేశమయ్యారు. ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా కొత్త ఇసుక విధానానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఆర్టీసీ విలీనం, కమిటీ నివేదికపై చర్చించనున్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై చర్చించనున్నారు. రాజధాని అమరావతి నిర్మాణంపై కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది. టీటీడీ పాలకమండలి సభ్యుల సంఖ్య 19 నుంచి 25కు పెంచుతూ కేబినెట్ తీర్మానం చేయనుంది. అదేవిధంగా సంక్షేమ పథకాల అమలు, నిధుల సమీకరణపై మంత్రివర్గం చర్చించనుంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/