ఈ నెల 27న ఏపి మంత్రివర్గం సమావేశం

AP cabinet meeting
AP cabinet meeting

అమరావతి: ఏపి మంత్రివర్గం ఈ నెల 27న సమావేశం కానుంది. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కీలకంగా చర్చించనుంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్‌ చర్చ జరపనుంది. అంతేకాకుండా అసెంబ్లీలో తీసుకురావల్సిన కీలక బిల్లులపై క్షుణ్ణంగా పరిశీలన, తుది నిర్ణయంపై చర్చించనుంది. ఇసుక వారోత్సవాలు, రాజధానిలో జరగబోయే టిడిపి అధినేత చంద్రబాబు పర్యటనపై చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఇంకా రాష్ట్రంలో జరుగుతున్న మైనింగ్‌లకు సంబంధించిన లీజుల రద్దుపై కూడా కేబినెట్‌ నిర్ణయాలను తీసుకోన్నునది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana