ఈనెల 19న ఏపి కేబినెట్‌ సమావేశం

సిఎం జగన్ అధ్యక్షతన మంత్రిమండలి భేటీ

AP CM YS Jagan
AP CM YS Jagan

అమరావతి: ఏపి కేబినెట్‌ ఈనెల 19న సిఎం జగన్‌ అధ్యక్షతన సమావేశం కానుంది. ఈ మంత్రిమండలి సమావేశంలో పలు సమస్యలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కరోనా నివారణ, చికిత్స, కొత్త జిల్లాల ఏర్పాటు, సంక్షేమ పథకాల అమలు, ముఖ్యంగా ఇళ్ల పట్టాల పంపిణీ, ఇటీవల తీసుకువచ్చిన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలు మొదలైన అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. అంతేకాకుండా, కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలల ప్రారంభంపైనా ఈ సమావేశంలో మంత్రిమండలి సభ్యులు తమ అభిప్రాయాలు తెలుపనున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/