8 అంశాలపై ఏపి కేబినెట్‌ సమావేశంలో చర్చ

Y S jagan
Y S jagan


అమరావతి: ఏపి మంత్రివర్గం తొలిసారిగా కొలువుదీరింది. వెలగపూడిలోని సచివాలయంలో ప్రారంభమైన ఈ భేటీలో ప్రధానంగా 8 అంశాలపై చర్చ జరగనుంది. ఏపి సియం జగన్‌ సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఆయా శాఖల నుంచి 8 అంశాలపై సమాచారాన్ని సేకరించారు. జగన్‌ ప్రమాణ స్వీకారం అనంతరం తొలి సంతకం చేసిన దస్త్రం అంటే సామాజిక పింఛనును రూ. 2 వేల నుంచి రూ. 3 వేలు వరకూ పెంచే క్రమంలో మొదటివిడతగా రూ250 పెంచిన పథకానికి నేడు కేబినెట్‌ ఆమోద ముద్ర వేయనుంది. అలాగే ఆశావర్కర్ల వేతనాన్ని రూ. 3 వేల నుంచి రూ 10 వేల వరకు పెంచుతూ సంతకం చేశారు. అక్టోబరు నుంచి అమలు చేయనున్న వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకం కింద రైతులకు ఏటా రూ. 12,500 చెల్లించే పథకానికి కేబినెట్‌ సమ్మతం తెలపనుంది. ఉద్యోగులకు ఐఆర్‌ ప్రకటించేందుకు అనుమతించనుంది. అలాగే కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ రద్దు, ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయడం, హోంగార్డుల వేతనాల పెంపు, పారిశుద్య కార్మికుల వేతనం పెంపుపై కేబినెట్‌ విస్తృతంగా చర్చించనున్నారు. వీటితో పాటు మరికొన్ని అంశాలను కూడా చర్చించనున్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/