ఏపి మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు

AP CM Jagan
AP CM Jagan

అమరావతి: నేడు ఏపి మంత్రివర్గం ఉదయం 11.30 గంటలకు సమావేశం కానుంది. ఈ భేటీలో కీలక నిర్ణయాలను ఆమోదించబోతుందని అధికారవర్గాల సమాచారం. ముఖ్యంగా ఇసుక అక్రమ రవాణా చేసేవారికి జైలు శిక్ష వేసేలా ఏపి కేబినేట్‌ ఆమోదం తెలపనుంది. కాలుష్య నిర్వహణ సంస్థ, ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియం అమలుపై ఆమోదం తెలపనుంది. సింగపూర్‌తో స్టార్టప్‌ ఏరియా రద్దుకు కూడా ఆమోదం తెలపనున్నారు. న్యాయవాదుల సంక్షేమ నిధి, బిల్డ్‌ ఏపి, ప్రభుత్వ భూములు అమ్మకాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరగనుంది. అదేవిధంగా మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి ఆర్థిక సాయంగా రూ.10 లక్షలు అందించే విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు. పట్టణాల్లోని అక్రమ లే ఔట్ల క్రమబద్ధీకరణ, గ్రామ న్యాయాలయాలపై కూడా చర్చించనున్నట్లుగా తెలిసింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/