ఏపి మంత్రివర్గం ప్రత్యేక సమావేశం

cm jagan
cm jagan

అమరావతి: ఏపి రాష్ట్ర మంత్రి వర్గం ప్రత్యేకంగా సిఎం జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం అయింది. శాసనసభలో ప్రవేశపెట్టే బిల్లులు, వివిధ చట్టాలకు చేయాల్సిన సవరణలపై చర్చించారు. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన, ప్రాజెక్ట్‌ రీటెండరింగ్‌ తదితర విషయాలను కూలంకషంగా చర్చించినట్లు సమాచారం. తదుపరి అసెంబ్లీ సమావేశాలల్లో వీటన్నింటినీ చట్టం రూపంలోకి తీసుకువచ్చే అవకాశముంది.


తాజా ఇ పేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/