ఈనెల 14న ఏపి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

ap cabinet meeting
ap cabinet meeting

అమరావతి: ఈనెల 14న ఉదయం 10.30 గంటలకు సచివాలయంలోని కేబినెట్‌ మీటింగ్‌ హాల్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. నాలుగు అంశాలతో సమావేశం ఎజెండాను సిఎం కార్యాలయం మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శ ఎల్వీ సుబ్రమణ్యానికి పంపించింది. ఫణి తుపాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు, రాష్ట్రంలో తాగునీటి పరిస్థితి, కరువు, ఇతర వాతావరణ పరిస్థితులు, నరేగా సహా రాష్ట్రంలో ఉపాధి పరిస్థితి ఈ నాలుగు అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్టు సీఎస్‌కి పంపిన నోట్‌లో సీఎంవో పేర్కొంది. మంత్రివర్గ సమావేశానికి సంబంధిత అధికారులంతా హాజరయ్యేలా ఆదేశాలు జారీ చేయాలని కోరింది.
కేబినెట్‌ సమావేశాన్ని ఈ నెల 10నే నిర్ణయించాలని మొదట అనుకున్నారు. కానీ ఎజెండాలోని అంశాలను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించి, అనుమతి తీసుకోవలసి ఉన్నందున సమయం సరిపోదన్న ఉద్దేశంతో ఈ నెల 14కి వాయిదా వేశారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/