వచ్చేనెల 4న ఏపి కేబినెట్‌ భేటి

ap cabinet meeting
ap cabinet meeting

అమరావతి: ఏపి మంత్రివర్గం వచ్చేనెల 4న సమావేశం కానుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేయాలని సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్ని శాఖాధిపతులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రివర్గ సమావేశంలో పలు కీలకాంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రారంభం, అమలుపై కేబినెట్‌ సమీక్షించి ఆమోదించనుంది. దీంతో పాటు పోలవరం ప్రాజెక్టు రివర్స్‌ టెండర్ల ఆమోదం, రాజధానిలో చేపట్టే అభివృద్ధి పనులపైనా చర్చించే అవకాశముంది.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/