ముగిసిన ఏపి తొలి మంత్రివర్గ సమావేశం

AP CABINET MEETING
AP CABINET MEETING


అమరావతి: ఏపి నూతన తొలి మంత్రివర్గ సమావేశం ముగిసింది. సియం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన సమావేశం ఐన కేబినెట్‌..సుమారు ఆరు గంటల పాటు వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. వైఎస్‌ఆర్‌ ఆసరా కింద వృద్ధాప్య పింఛన్లను రూ. 2,250కి పెంపు, అక్టోబరు నుంచి రూ. 12,500 చెల్లింపుతో రైతు భరోసా అమలు, ఆశా వర్కర్లకు రూ. 10 వేల వేతనాల పెంపునకు సంబంధించిన నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. దీంతోపాటు గిరిజన ప్రాంతాల్లో కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్ల వేతనం రూ.400 నుంచి రూ. 4000 పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. సిపిఎస్‌ రద్దు, ప్రభుత్వంలో ఆర్టీసి విలీనం అంశాలపై కమిటీలు వేయాలని కేబినెట్‌ నిర్ణయించింది.

తాజా సినిమా వీడియోల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos